ముస్హఫ్లో 90వ సూరా, 20 ఆయతులు, 594వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!
2. మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.[1]
[1] కొందరు: "తండ్రి (మూలపురుషుడు) అంటే ఆదమ్ ('అ.స.) మరియు అతని సంతానం అంటే మానవజాతి." అన్నారు.
3. మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!
4. వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.
5. ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?
6. అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.[1]
[1] లుబదన్: కసీ'ర్, చాలా
7. ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?[1]
[1] అంటే అతడు చేసే వృథా ఖర్చును ఎవ్వరూ చూడటం లేదని భావిస్తున్నాడా? అల్లాహ్ (సు.తా.) అంతా చూస్తున్నాడు.
8. ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?
9. మరియు నాలుకను మరియు రెండు పెదవులను.
10. మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1]
[1] చూడండి, 76:3 అన్-నజ్ దు: అంటే ఎత్తైన స్థలం. అన్-నజ్ దైన్: అంటే రెండు మార్గాలు.
11. కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు![1]
[1] చూఅల్-'అఖబహ్: కొండ శిఖరం (పైకి ఎక్కడం) కొందరు దీనికి కనుమ అనే అర్థం ఇచ్చారు. అంటే రెండు కొండల నడిమి త్రోవ, సందు. కఠినమైన కనుమ అంటే ఒక బానిసను బంధం నుండి విముక్తి చేయించడం, లేక తాను ఆకలితో ఉండి కూడా ఒక అనాథకి అన్నం పెట్టడం.
12. మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?
13. అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.[1]
[1] చూడండి, 2:177.
14. లేదా ఆకలి (కరువు) ఉన్న[1] రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.
[1] మస్'గబతున్: ఆకలి.
15. సమీప అనాథునికి గానీ;
16. లేక, దిక్కులేని నిరుపేదకు గానీ![1]
[1] జా-'మత్ రబతున్: మట్టిపై పడి ఉండే పేదవాడు. ఎవడికైతే ఇల్లు ఉండదో!
17. ఆ తరువాత విశ్వసించి, సహనాన్ని ఒకరికొకరు బోధించుకునేవారిలో మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.
18. ఇలాంటి వారే కుడిపక్షం వారు.[1]
[1] అతడు విశ్వాసి అయిఉంటేనే, చేసిన పుణ్యాల ఫలితం దొరుకుతుంది లేకపోతే పరలోకంలో అవి వృథా అయిపోతాయి.
19. ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.
20. వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.[1]
[1] ము'అసదతన్': ము'గ్ లఖతున్, అంటే చుట్టుకుంటుంది. చూడండి, 104:6-8.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.