తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అజ్-జల్'జలహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 99వ సూరా, 8 ఆయతులు, 599వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-బయ్యినహ్సూరా అల్-ఆదియాత్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు![1]

[1] ఇది మొదటి సారి బాకా ఊదబడినప్పుడు సంభవిస్తుంది.

2. మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు![1]

[1] ఇది రెండవసారి బాకా ఊదబడినప్పుడు జరుగుతుంది. ఆ రోజు భూమి తనలో పాతబడిన వారినంతా బయట వేస్తుంది. వారంతా సజీవులై లేచి బయటికి వస్తారు.

3. మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.

4. ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.[1]

[1] దాని సమాచారాలు ఇలా ఉంటాయి, దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ప్రతివ్యక్తి భూమిపై చేసిన కర్మలన్నింటికీ, అది సాక్ష్యమిస్తుంది: 'ఈ ఈ వ్యక్తి ఈ ఈ కర్మలు, ఈ ఈ రోజులలో చేసాడని, తెలుపుతుంది.' " (తిర్మి'జీ, ముస్నద్ అ'హ్మద్-2/374).

5. ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.

6. ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.

7. అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.[1]

[1] జ'ర్రతున్: దీనికి వేర్వేరు వ్యాఖ్యానాలు ఇవ్వబడ్డాయి. 1) చీమకంటే చిన్న వస్తువు - షౌకానీ. 2) మానవుడు భూమిపై చెయ్యికొట్టి పైకిలేపిన తరువాత దానికి అంటుకునే దుమ్ము. 3) ఒక రంధ్రం నుండి వచ్చే సూర్యకిరణాలలో తేలియాడుతూ కనిపించే ధూళి. 4) పరమాణువు.

8. మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-బయ్యినహ్సూరా అల్-ఆదియాత్ ›