ముస్హఫ్లో 100వ సూరా, 11 ఆయతులు, 599వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా![1]
[1] 'దబ్'హన్: వగర్చుతూ.
2. తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;[1]
[1] అల్-మారియాతు: అగ్నికణాలు లేపే! ఖద్'హున్: ఖరాల తట్టులు.
3. తెల్లవారుఝామున దాడి చేసేవాటి;[1]
[1] అల్-ము'గీరాతు: దాడి చేసేవాటి.
4. (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;[1]
[1] అసా'ర: లేపుట, నఖ్'వున్: దుమ్ము.
5. (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.
6. నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.[1]
[1] కనూదున్: అంటే కఫూరున్, కృతఘ్నుడు.
7. మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.
8. మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.
9. ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;[1]
[1] అంటే గోరీలలో ఉన్న శవాలను సజీవులుగా చేసి లేపి సమావేశపరచబడినప్పుడు.
10. మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;
11. నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.