తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-ఖారిఅహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 101వ సూరా, 11 ఆయతులు, 600వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ఆదియాత్సూరా అత్-తకాథుర్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం![1]

[1] అల్-'ఖారిఅతు: అంటే హృదయాలను అదరగొట్టేది, పునరుత్థాన దినపు పేర్లలో ఒకటి. చూడండి, 14:48, 20:105-107. దాని ఇతర పేర్లు (1) అల్-'హాఖ్ఖతు, (2) అత్తామ్మతు, (3) అస్సాఖ్ఖతు, (4) అల్-'గాషియతు, (5) అస్సా'అతు (6) అల్-వాఖి'అతు; (7) అల్-ఖారి'అతు.

2. ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?

3. మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?

4. ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.[1]

[1] అల్-ఫరాషు: Moath, Lepidoptira రాత్రులలో తిరిగే చిన్న పురుగు, చిమ్మెట, దీపపు పురుగు.

5. మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన ఉన్ని వలే అయి పోతాయి.[1]

[1] అల్-'ఇహ్ నున్: రంగురంగుల అల్-మన్ ఫూష్: ఏకిన ఉన్ని.

6. అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో![1]

[1] చూడండి, 7:8, 18:105, 21:47 సత్కార్యాల త్రాసు పళ్ళెం బరువైనదిగా ఉంటుంది.

7. అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.

8. మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో![1]

[1] ఎవరి సత్కార్యాల పళ్ళెం తేలికగా మరియు పాపాల పళ్ళెం బరువుగా ఉంటుందో!.

9. అతని నివాసం అధః పాతాళమే.[1]

[1] అల్-హావియహ్: నరకపు ఒక పేరు. ఉమ్మున్: తల్లి, శరణమిచ్చేది.

10. మరియు అది ఏమిటో నీకేం తెలుసు?

11. అదొక భగభగమండే అగ్ని (గుండం).[1]

[1] 'హామియతున్: 'నరకాగ్ని. మానవులు రగిల్చే అగ్ని కంటే నరకాగ్ని డెబ్భై రెట్లు అధికంగా మండుతూ ఉంటుంది, ('స. బు'ఖారీ, 'స. ముస్లిం).

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ఆదియాత్సూరా అత్-తకాథుర్ ›