ముస్‌హఫ్‌లో 113వ సూరా, 5 ఆయతులు, 604వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు (అల్లాహ్) యొక్క శరణు వేడుకుంటున్నాను.
2. ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]
[1] ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.
3. మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]
[1] ఎందుకంటే చీకటిలోనే హానికరమైన జంతువులు, పాములు, తేళ్ళు బయటికి వస్తాయి. నేరస్థులు రాత్రిలోనే నేరాలు చేస్తారు. ఇక్కడ విధమైన అన్ని కీడుల నుండి శరణు కోరబడుతోంది.
4. మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;[1]
[1] అన్-నఫ్ఫాసా'తి: అంటే ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుండి.
5. మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]
[1] 'హాసిదిన్: అసూయపడే వాడి కీడు నుండి కూడా శరణు కోరబడుతోంది.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.